విశాఖపట్నం(ఉదయజ్యోతి): ఏ ఒక్క నిరుపేద ఆకలితో ఉండకూడదు అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం 2వ విడత నిత్యవసర సరకుల పంపిణీపై ఆయన ఉదయం 5.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండవ విడత రేషన్ పంపిణీలో నిత్యవసర సరకుల పంపిణీలో లబ్ధిదారులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులందరికీ నిత్యవసర సరుకులు పంపిణీ లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా డిపో డీలర్లు జాగ్రత్త వహించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ మాట్లాడుతూ జిల్లాలో 2179 రేషన్ షాపులు ఉన్నాయని, ప్రస్తుతం అదనంగా 2621 షాపులకు సంబంధించి కౌంటర్లు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. వీటిని మొబైల్ ఆప్ ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎస్ఓలు నిర్మాలా భాయ్, శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ జిల్లా పౌర సరఫరాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రేషన్ షాపు ఉదయం 6.00 గంటలకే లాగ్ ఇన్ అవ్వాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా పౌర సరఫరాల అధికారులు తెలుసుకొని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. లాగ్ ఇన్ సమస్యలు పౌర సరఫరాల అధికారులతో పరిష్కారం కానియెడల ఉదయం 6.30 గంటలకే తన దృష్టికి తీసుకురావాలని, ప్రతీ 15 నివిుషాలకు నిత్యవసర సరకుల పంపిణీ వివరాలను తెలియజేయాలన్నారు.
అనంతరం మారికవలసలో 192, 194 పాపులు, పరదేశపాలెంలో 225, 552, 504 పాపులను మొబైల్ ఆప్ అదనపు కౌంటర్లను ఆయన పరిశీలించి ఏ విధంగా పనిచేస్తున్నది అక్కడ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ప్రజలను రేషన్ సక్రమంగా అందుతున్నదీ లేనిది ఆయన అడుగగా అన్ని సక్రమంగానే అందుతున్నాయని ప్రజలు జాయింట్ కలెక్టర్ కు తెలిపారు. అక్కడ నుండి 104 ఏరియా రిలియన్స్ ఫ్రెష్ మరియు బిర్లా జంక్షన్ లో గల డి మార్ట్, మోర్ షాపులను ఆయన పరిశీలించి నిత్యవసరాల ధరల పట్టికను వారు ఇచ్చే ధరలకు, ప్రభుత్వ ధరలకు సరిపోయింది లేనిది చూసి ఆ షాపు యాజమాన్యానికి పలు సూచనలు జారీ చేశారు.
2వ విడత నిత్యవసర సరుకులు సత్వరమే పంపిణీ ........... పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్.