శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి సిద్ధమవుతున్న గంధం
 



విశాఖపట్నం(ఉదయజ్యోతి): ఈ నెల 26న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ మహోత్సవానికి శనివారం ఉదయం 7.30 గంటలకు చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. దేవస్థానం ఈవో వేంకటేశ్వర రావు, ఆలయ ప్రధానార్చకులు,వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా స్వామివారి చందనోత్సవ మహోత్సవానికి అవసరమైన చందన చెక్కల అరగదీత పనులను ప్రారంభించారు. ఈ మహోత్సవం లో స్వామికి కావలసిన  33.800 కేజీల చందనం చెక్కలను అరగదీస్తారు. ఈ నెల 26న వైశాఖ శుద్ధ తదియ ఆదివారం స్వామి వారి కి తోలి విడత గంధం సిద్ధం చేయనున్నారని దేవస్థానం ఈవో వేంకటేశ్వర రావు తెలిపారు.