విశాఖపట్నం : రేషన్ పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ డీలర్లను ఆదేశించారు. శనివారం నగరంలోని బుచ్చిరాజుపాలెం, పాత కరాస, తదితర షాపులను ఆయన సరదర్శించి పరిశీలించారు. షాపు నం.78, 86, 75 డీలర్ షాపులను మరియు అదనంగా ఏర్పాటు చేసిన షాపులను ఆయన పరిశీలించి పంపిణీ ఏ విధంగా జరుగుతున్నది, కూపన్ల వారీగా చేస్తున్నది లేనిది పరిశీలించారు. లబ్దిదారులు భౌతిక దూరం పాటించి రేషన్ తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని డీలర్లను ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
రేషన్ పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు - జిల్లా జాయింట్ కలెక్టర్